Thursday, July 12, 2018

‼➖🌏చరిత్రలో ఈ రోజు జూలై 12➖‼

*‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై  12➖‼*
┅═══════════════════════┅

*♨📆జూలై 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 193వ రోజు (లీపు సంవత్సరములో 194వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 172 రోజులు మిగిలినవి.*

           *➖💥సంఘటనలు💥➖*

*♨1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.*

*♨1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.*

                *➖🎂జననాలు🎂➖*

*♨క్రీ.పూ. 101/102 - జూలియస్ సీజర్.*

*♨1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973).*

*♨1906: పువ్వాడ శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981).*

*♨1930: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణా ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991).*

*♨1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు మరియు మాజీ లోకసభ సభ్యుడు. (మ.2017).*

*♨1955: నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణా రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.*

*♨1957: శ్రీలక్ష్మి రేబాల, ప్రముఖ నటి, భరతనాట్య కళాకారిణి.*

*♨1958: శిలాలోలిత, ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు.*

*♨1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత మరియు ఔత్సాహిక మల్లయోధుడు.*

*♨1982: ఆచంట శరత్ కమల్, ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు.*

                *➖🍁మరణాలు🍁➖*

*♨1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703).*

*♨1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877).*

*♨1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923).*

*♨1994: ఎం.ఎస్.ఆచార్య, ప్రముఖ పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924).*

*♨1999: రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929).*

*♨2012: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928).*

        *‼➖జాతీయ దినాలు➖‼*

*♨కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.*

*♨సావొ టోమె మరియు ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది.*

*♨నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు (మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియాలో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి, విలువిద్య లలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది.*

*♨నాబార్డ్ స్థాపక దినోత్సవం.*

*♨తెలంగాణలో మూడవ విడత హరితహారం ప్రారంభం.*

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

No comments:

Post a Comment

updating every news