Tuesday, July 10, 2018

‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై  10➖‼

*‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై  10➖‼*
┅════════════════════════┅

*♨📆జూలై 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 191వ రోజు (లీపు సంవత్సరములో 192వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 174 రోజులు మిగిలినవి.*

              *➖💥సంఘటనలు💥➖*

*♨1794: పద్మనాభ యుద్ధం జరిగింది.*

*♨1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.*

*♨1991: భారత లోక్‌సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.*

*♨2008: సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.*

                 *➖🎂జననాలు🎂➖*

*♨1856: నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.*

*♨1916: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990).*

*♨1920: పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు. (మ.2007).*

*♨1926: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.*

*♨1928: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009).*

*♨1928: గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ*

*♨1939: కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు.*

*♨1945: కోట శ్రీనివాసరావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు.*

*♨1949: సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా ప్రసిద్ధి చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.*

*♨1951: మెడియం బాబూరావ్, భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.*

*♨1980: జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి మరియు బుల్లితెర ప్రముఖురాలు.*

               *➖🍁మరణాలు🍁➖*

*♨1794 : పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి ఉంది.*

*♨1806 : జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా ప్రసిద్ధుడు. (జ.1724)*

*♨1966 : భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్.*

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

No comments:

Post a Comment

updating every news